హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా- మీకోసం’ యాత్రలో పంపిణీ చేసింది నకిలీ మద్యమేనని స్పష్టమైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆర్థిక తోడ్పాటుతోనే ఈ మద్యం ఏరులై పారినట్టు తేలింది. చంద్రబాబు పాదయాత్రకు జనసమీకరణ చేసేందుకు తెలుగుదేశం జిల్లా కమిటీ సంయుక్త కార్యదర్శి టీడీపీ నేత సాలక్కగారి శ్రీనివాసులు ఫాంహౌస్ నుంచి నకిలీ మద్యం సరఫరా చేస్తుండడాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. పెనుగొండ ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు గురువారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ డీఎస్ చౌహన్‌ను కలిసి కేసు పూర్వాపరాలను వివరించారు. కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న సాలక్కగారి శ్రీనివాసులు పరారీలో ఉన్నారని, ఆయన పట్టుబడితే మరిన్ని ఆధారాలు దొరుకుతాయని నివేదించారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు యాత్రలో తిరుగుతున్నారని, అక్కడే అరెస్టు చేస్తే రాజకీయంగా దుమారం రేగడంతోపాటు , శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్‌కు వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. యాత్ర తొలి రోజు నుంచే నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నారని, కొత్తచెరువులోని శ్రీనివాసులకు చెందిన ఫాంహౌస్ నుంచి టాటా సుమో వాహనం ద్వారా ఈ మద్యాన్ని గ్రామాలకు తరలించారని అధికారులు నిర్ధారించారు.
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు దాదాపు రూ.35 లక్షల మేర ఆర్థిక సాయం అందించినట్లు ఈ కేసులో మరో నిందితుడు సురేష్ అలియాస్ దాల్‌మిల్ సూరి వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారమైతే.. ఇప్పటికే దాదాపు 1,000 కేసుల మద్యాన్ని పంపిణీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. సదరు ఎమ్మెల్యే ప్రమేయంపై ముందుగా వీలైనన్ని ఎక్కువ ఆధారాలు సేకరించాలని, ఆ తర్వాతే ఆయనపై కేసు నమోదు చేసే విషయాన్ని ఆలోచించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టర్ సూచించినట్లు తెలిసింది. నకిలీ మద్యం అదే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నుంచి తెచ్చినట్లు భావిస్తున్నారు.

No comments:
Post a Comment