చంద్రబాబుపై సీబీఐ విచారణ అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కుమ్మక్కులో భాగమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆమె కర్నూలులో కళానికేతన్ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం శోభానాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబుపై సీబీఐ విచారణ చేయించేంత సత్తా ప్రభుత్వానికి లేదన్నారు.
కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావటం ఖాయమన్నారు. బాబు ఓ పక్క పాదయాత్ర చేస్తుంటూ మరోపక్క కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ నేతలకే నమ్మకం కలిగించని చంద్రబాబు ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు

No comments:
Post a Comment