వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పట్టికీ ఆయన పార్టీలో చేరేవారు చేరుతూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ ను కలుసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన జగన్ పార్టీలో చేరుతున్నరని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కు వెంకటరావు నుంచి పోటీ వస్తుందా అన్న చర్చ కూడా ఉంది.జలగం వెంకటరావు రెండువేల నాలుగులో సత్తుపల్లి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడ్ నియోజకవర్గంగా మారితే ఖమ్మం నుంచి పోటీచేశారు. కాకపోతే టిక్కెట్ రాకపోవడతో ఆయన తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి టిడిపి నేత తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరబోతున్నారు.
source: komineni
source: komineni
No comments:
Post a Comment