10-10-12-4926.jpg)
ఒక్కొక్క విద్యార్థికి నెలవారీ మెస్ చార్జీల కింద 1090 రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ సిఫార్సు చేస్తే అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. అడక్కుండానే సబ్సిడీ బియ్యం ధరను రెండు రూపాయల నుంచి రూపాయికి తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లకు మాత్రం నాలుగు రూపాయలకు సరఫరా చేస్తోందని తప్పుబట్టారు. సబ్సిడీ వంట గ్యాస్‌ను హాస్టళ్లకు కూడా ఏడాదికి ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు. మీకోసం అంటూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాలను పట్టించుకోకుండా ఎంత సేపూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిలపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని పుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment