వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ప్రాంతాలను విభజించాల్సివస్తే ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతో పాటు వేలాది మంది కార్యకర్తలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్, తెలంగాణ కోసం ప్రాణాలు విడిచిన వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మహానేత సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. పైసా పన్ను పెంచకుండా పాలన సాగించారన్నారు. జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని వైఎస్‌ఆర్ కలలు గన్నారని తెలిపారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఏ రంగమైన ముందుకు కెళ్లిందా అని ప్రశ్నించారు. మాయ మాటలు చెబుతున్న చంద్రబాబును నమ్మొద్దని సూచించారు. కుట్ర చేసి జగన్ ను జైల్లో పెట్టారని విజయమ్మ ఆరోపించారు. త్వరలోనే జగన్ బయటికి వస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
source:sakshi

No comments:
Post a Comment