రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు వెనుకాడుతున్నారని బాజిరెడ్డి బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తి ఎదుగుతోందని బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. గురువారమిక్కడ జరిగిన వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో జిట్టా బాలకిష్టారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బాలమణెమ్మలతో కలిసి వీరు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరగనున్న షర్మిల పాదయాత్రపై చర్చించారు. తెలంగాణ తెస్తానని ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని జిట్టా బాలకిష్టారెడ్డి, ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఇదే అనువైన సమయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా జీవనం స్తంభించిందని, పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు. బాధ్యత గల ప్రతిపక్షమైతే టీడీపీ వెంటనే అవిశ్వాసం పెట్టాలన్నారు. టీడీపీ అవిశ్వాసం పెడితే వైఎస్‌ఆర్ సీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment