అవిశ్వాసంపై డొంకతిరుగుడు సమాధానాలు వద్దని, చెప్పేది నేరుగా, స్పష్టంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన పాదయాత్రలో ప్రతిచోట ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని చెబుతున్నారని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్ట్రని అయన ప్రశ్నించారు. అవిశ్వాసంపై ఒంకరిటింకరి మాటలు, ఆయోమయ ప్రకటనలు చేయవద్దన్నారు. శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరగడంలేదని, అయినప్పటికీ స్పష్టంగా ప్రకటించాలన్నారు. తమకు సంఖ్యాబలం ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేవారమని ఆయన చెప్పారు. బలప్రదర్శనకు, అవిశ్వాసానికి తేడా ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులే పరిపాలనపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని టిఆర్ఎస్ కూడా చెబుతోందన్నారు. తాము కూడా మద్దతు తెలుపుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. తాము ప్రజల నుంచే అధికారం పొందుతామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment