'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కపటి గ్రామానికి చేరుకున్న షర్మిలకు ప్రజలు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఏడు గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్న ప్రభుత్వం కేవలం ఒకటి, రెండు గంటల విద్యుత్ నే ప్రభుత్వం అందిస్తోందని, విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని వాపోయారు. అంతేకాక నకిలీ విత్తనాలతో పంట దిగుబడి తగ్గుతోందని.. పండిన పంటకు కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం లేదని షర్మిల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి పెడితే.. ఐదు వేల రూపాయలు కూడ రావడం లేదన్నారు. రైతుల బాధల్ని విన్న షర్మిల కపటి గ్రామంలోని పత్తి రైతుల పంటను పరీక్షించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment