వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు (సీఈసీ)గాను, తెలంగాణ ఐదు జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా జిట్టా బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు జిట్టా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిట్టాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్లు వీరే..
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పలు జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కన్వీనర్లను, కో-ఆర్డినేటర్లను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నేతల ఎంపిక జరిగినట్లు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ సోమవారం తెలిపారు.
కన్వీనర్లు: వరంగల్ జిల్లా - తక్కల్లపల్లి మోహన్‌రావు, తూర్పుగోదావరి జిల్లా- అడపా వెంకట రమణ (గెడ్డం రమణ), ఒంగోలు సిటీ- ముదవర్తి బాబూరావు, హైదరాబాద్ సిటీ- శివకుమార్, విశాఖపట్నం రూరల్- మస్తానప్ప.
కో-ఆర్డినేటర్లు: పి.నర్సింహారెడ్డి- మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్; ఎం.బాబురావు- ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం; బి.ఓబుల్‌రెడ్డి- అనంతపురం, చిత్తూరు; ఎ.రాజారెడ్డి- వైఎస్‌ఆర్ జిల్లా, కర్నూలు; సీహెచ్ రవీంద్రారెడ్డి- రంగారెడ్డి, విశాఖపట్నం, గుంటూరు; ఎన్.హరికృష్ణ- నిజామాబాద్, మెదక్, నల్లగొండ; ఎం.ఎస్.వి.ఆర్.మూర్తి- శ్రీకాకుళం, విజయనగరం; ఎన్.రవిప్రసాద్- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి; సీహెచ్ మనోరంజని- కృష్ణా; పి.మాధవనర్సింహా రెడ్డి- ప్రకాశం, నెల్లూరు.
No comments:
Post a Comment