నమ్ముకున్న క్యాడర్, నమ్మకం ఉంచిన ప్రజల కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగని వైఎస్ కుటుంబానికి ఎమ్మిగనూరు ప్రజలు కొండంత అండగా నిలుస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే ఈ ప్రాంతంతో మూడు దశాబ్దాలుగా రాజకీయ బంధం పెనవేసుకున్న వైఎస్ కుటుంబంపై ప్రజలు అభిమానం చూపుతున్నారు. గతంలో మహానేత వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ వచ్చిన సమయంలో ఈ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. 2012 ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మరో సారి వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేసి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న తరుణంలో జనం కోసం మహానేత కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సోమప్ప సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించి అభిమానుల్లో ఉత్తేజం నింపిన సోమప్ప సర్కిల్‌లోనే షర్మిల ప్రసంగిస్తుండటం సర్వత్రా ఆసక్తిని పెంచుతున్న అంశం. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు షర్మిల బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్నారు. ‘వై’ అంటే ఎమ్మిగనూరు.. ‘ఎస్’ సోమప్ప సర్కిల్ అనే నానుడికి సరిపోలే విధంగా వైఎస్ కుటుంబం రాజకీయ ప్రసంగాల వేదికగా సోమప్ప సర్కిల్ మారింది.
1980వ సంవత్సరం మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి చిన్న కుమారుడు వివాహం సందర్భంగా అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఎమ్మిగనూరుకు వచ్చారు.
2000 మే 30న వగరూరులో దాడులకు గురైన కాంగ్రెస్ కార్యకర్తలను ఓదార్చేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో దీక్షా శిబిరం వద్ద ప్రసంగించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం 2004 నవంబర్‌లో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరుకు వచ్చి ప్రసంగించారు.
2006 జూన్ 3న సూగూరు రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి, 2008 సెప్టెంబర్ 21న పులికనుమ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఓదార్పు యాత్రలో భాగంగా 2011 జూలై 31న ఎమ్మిగనూరుకు వచ్చిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమప్ప సర్కిల్‌లో మొదటి సారిగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.
2012 మే 13న ఉప ఎన్నికలకు ముందుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో ప్రసంగించారు. చేనేత సమస్యలు, రైతు సమస్యలను ప్రధానంగా వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు విశదీకరించారు.
2012 జూన్6న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమప్ప సర్కిల్‌లో ఉప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ సభలో షర్మిల కూడా పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం అదే సర్కిల్‌లో షర్మిల ప్రసంగిస్తుండటం విశేషం.

No comments:
Post a Comment