తెల్లటి బట్టలు ధరించి కల్మషం లేని నవ్వు నవ్వుతూ అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి రాజన్న మన మధ్య అన్న లేకున్నా అదే చిరునవ్వుతో అందరి మన్ననలను అందుకున్న వ్యక్తి జగన్.
ఒకసారి అసెంబ్లీలో రాజన్న మాట్లాడుతూ ‘‘నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం ఒక రోగం’’ అని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్న మాటలు ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి ఆంధ్రుడికి గుర్తుంటాయి. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అదే చిరునవ్వుతో పలకరించి అతి చిన్నవయసులో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మన జగన్.
కాని నవ్వును కూడా రాజకీయం చేసి కొత్త భాష్యం చెప్పే నీచమైన కుసంస్కారం గల వాళ్లను ఇప్పుడు చూస్తున్నాం. జగన్‌ను జైలు పాలు చేసి ఆనందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు తమ స్థానాలు చాలా పదిలంగా ఉంటాయని కలలుగంటున్నారు.
నిజానికి అధికారం మీకు కలగానే మిగిలిపోతుంది. ఎన్నో వేల, లక్షల చేతులతో మా ఓటు హక్కును వినియోగించుకుని మీకు అతి తొందరలో తీర్పు నివ్వబోతున్నాం. ఆ చిరునవ్వు నవ్వే వ్యక్తే మా అందరి అధినాయకుడు.
- వేమవరం ఆశీర్వాదం, ముద్దనూరు, వై.ఎస్.ఆర్.జిల్లా
మా అందరి ప్రాణం జగన్
ఇప్పుడు రాష్ట్రం వైఎస్‌ఆర్ లేక ఎలా ఉంది? మంచిపాలన, పాలకుడు లేక విలవిలలాడిపోతోంది. అభివృద్ధి లేదు. ఉద్యోగాలు లేవు. ఎప్పుడూ జగన్ గురించి దుష్ట ఆలోచనలు, రోత ఆలోచనలు తప్ప పాలన మీద నాయకులకు దృష్టి లేదు. అధికారం ఉంది కదాని మీ వయసులో సగం కూడా లేని జగన్‌ను ఇన్ని కష్టాలు పెట్టే మీ మనసులు ఎలాంటివో ప్రతి పౌరునికి అర్థమైపోయింది. అందుకే జగన్ మా అందరి ప్రాణం. ఎన్ని కష్టాలెదురైనా జగన్‌కు అండగా ఉంటాం. అధికారం కోసం మీరు ఎన్ని కుట్రలు, జమ్మిక్కులు చేసినా జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. మరి మీరెక్కడుంటారో.
- గోగుల కృపామణి, కర్నూలు
నీ రాక కోసం...
ఆశ లేక భరోసా ఇవ్వక
గింజ లేక నారు లేక
కరెంటు లేక పొలాలకు నీరు లేక
పాలకులు చీకట్లో నిద్రపోతుంటే
జగన్! ప్రతి రైతూ నీ కోసం ఎదురుచూస్తున్నాడు!
నీవు తెస్తానన్న రైతు రాజ్యం కోసం ఆరాటపడుతున్నాడు!!
ఆరోగ్యశ్రీ లేక, 108 రాక
ఆక్సిజన్ లేక, ఆదుకునే సామాగ్రిలేక
మందులేక మాకులేక
విలువైన ప్రాణాలెన్నో గాలిలో కలుస్తుంటే
జగన్! ప్రతి పేద గుండె నీకై విలపిస్తోంది!
చదవాలని వున్నా, స్థోమత లేక
ఆదుకుంటుందన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ జాడలేక
ఉన్నా ఒక పద్ధతి లేక
ప్రభుత్వం ఫీజుతో రాజీపడనంటుంటే
జగన్... ప్రతి పేద విద్యార్థి నీకోసమే ఎదురు చూస్తున్నాడు!
ఉప్పు అందక పప్పు అందక
పండు అందక కూరగాయలందక
గ్యాస్ అందక- వంటవండక
మెతుకులేక - కడుపునిండక
ఆకలితో అల్లాడుతున్న ప్రతి బీదబతుకు
జగన్... నీ రాక కోసమే తల్లడిల్లుతోంది.
చేయూత లేక నేత లేక
మగ్గమాడక డొక్కాడక
ధరగిట్టక బట్టకదలక
జగన్... ప్రతి చేనేత ఎద నీకై కదలాడుతోండి!
ఓ జననేతా!
ఈ సారి నీకు న్యాయం జరగకుంటే
ఉప్పెనై ఉరుకుతాం
మహోగ్రమై కదులుతాం
నిజమైన న్యాయాన్ని బతికించేందుకు
మా ప్రాణాలైనా ఇస్తాం
నిన్ను మా మధ్యలోకి తెచ్చుకుని
రాజన్నరాజ్యంతో సుఖజీవనం సాగిస్తాం
- యన్.యమ్.సుభాని, ఇంటూరు, గుంటూరు జిల్లా
source:sakshi

No comments:
Post a Comment