వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. హెచ్. మొరవణి నుంచి ఉదయం ప్రారంభమయ్యే షర్మిల యాత్ర నాలుగో మైలు క్రాస్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస్ సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్, సోమప్ప సర్కిల్, జామియా మసీదు, ఎంబీ చర్చి, కలుగట్ల రోడ్డు మీదుగా గణేష్ రైస్‌మిల్లు చేరుకుంటుంది. సోమప్ప సర్కిల్‌లో బహిరంగ సభ ఉంటుందని, రాత్రి బస గణేష్ రైస్ మిల్లు వద్దనేనని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment