కాంగ్రెస్ పార్టీలో అవినీతి పరులకు పెద్దపీట వేసి మంచి వారిని బయటకు వెళ్లేలా చేస్తారని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం బైచిగేరి గ్రామం వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో ఓపికతో ఉంటే పదవులు వస్తాయి అని చెప్పే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి గతంలో ఎంపీ టిక్కెట్ రాదనే ఆందోళనలో కర్నూలు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎందుకు తగలబెట్టారని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం లభించదన్నారు. 1978 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన తనకు గుర్తింపు ఇవ్వలేదన్నారు. అనంతరం టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.
కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కోట్ల కాంగ్రెస్ వారికి కాకుండా టీడీపీకి సహకారం అందించిన వారికి పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని, కర్నూలు, ఆదోని, డోన్ మార్కెట్ యార్డు పదవులను అమ్ముకున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఎన్ని రోజులు పదవిలో ఉంటాడో తెలియని కోట్ల కర్నూలు టౌన్ స్టేషన్‌ను సిటీగా మారుస్తే చాలు అని అన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతలుండని, వైఎస్ కలలు గన్న రైతన్న రాజ్యం వస్తుందన్నారు.
source:sakshi

No comments:
Post a Comment