'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా దొడ్డిమేకల గ్రామంలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. గ్రామస్థులు తమ గోడుకు షర్మిలకు చెప్పుకున్నారు. వర్షాలు, విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. సమయానికి బస్సులు రావడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఉపాధి కూలి రూ.120 వస్తే.. ఇప్పుడు రూ.30 కూడా రావడం లేదని వాపోయారు. పింఛన్ల విషయంలో ఈ ప్రభుత్వం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుందని షర్మిల దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ హయాంలో విత్తనాలు, ఎరువుల ధరలు పెరగలేదని గుర్తు చేశారు. రాజన్నరాజ్యం మళ్లీ వస్తుందని, మీ సమస్యలన్ని తీరుతాయని వారికి షర్మిల భరోసా ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment