http://ysrcongress.com/news/news_updates/budhavaram_sharmila_padayatra.html
'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 28వ రోజు పాదయాత్ర బుధవారం ఉదయం ఎమ్మిగనూరు రోడ్డు నుంచి చిన్నపెండెకల్ క్రాస్, బిచెగిరి క్రాస్, కాపటి మంత్రాలయం మీదుగా రంగాపురం చేరుకుంటుంది. రాత్రికి రంగాపురంలో బస ఉంటుంది. బుధవారం పాదయాత్ర 13 కిలోమీటర్ల మేర సాగనుంది. ప్రజాస్పందనను దృష్టిలో ఉంచుకుని ఆదోని పరిసర ప్రాంతాలలో పాదయాత్ర షెడ్యూలును విస్తృతం చేసిన సంగతి తెలిసిందే. వైయస్ఆర్ సీపీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలియజేశారు.
No comments:
Post a Comment