YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 17 November 2012

రాజన్న వరం.. మెట్టకు జీవం

పేదల కష్టాలు తమవిగా భావిస్తారు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయరు. అందరూ బాగుండాలనే ఆశ. వారి కోసం ఏదో చేయాలనే తపన. ఇదీ మహానేత వైఎస్‌ఆర్ కుటుంబీకుల మనస్తత్వం. మాట తప్పను...మడమ తిప్పను అంటూ ఎప్పుడూ చెప్పే మహానేత ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి జన హృదయాల్లో స్థిర స్థాయికి నిలిచారు. అదే బాటలో నడిచిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ప్రజల కష్టాలు తెలుసుకుని ఓదార్చేందుకు రాజన్న బిడ్డ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆదివారం నుంచి కోడుమూరు నియోజకవర్గం మీదుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహానేత జలయజ్ఞ ఫలాలపై ‘న్యూస్‌లైన్’ కథనం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. 1999లో ఏర్పడిన కరువు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ఆర్ కోడుమూరు, గూడూరు మండలాల్లో పర్యటించారు. అన్ని మెట్ట పొలాలే.. వర్షాలొస్తే సేద్యం. లేదంటే నష్టాలే కళ్లారా చూశారు. ఈ ప్రాంత ప్రజలకు ఏదో చేయాలని నిర్ణయించుకున్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ ్య పెట్టేందుకు 1999లో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఓట్లేయించుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఈ పథకాలకు పైసా విదిల్చలేదు. 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్‌ఆర్ నియోజక వర్గంలోని సి.బెళగల్, గూడూరు, కల్లూరు మండలాల్లోని కిష్టదొడ్డి, చింతమానుపల్లె, రేమట, మునగాల ఎత్తిపోతల పథకాలకు రూ. 36.20 కోట్ల నిధులు విడుదల చేశారు. ఏపీఎస్‌ఐడీసీ శాఖతో పనులు చేయించి ఎత్తిపోతల పథకాలకు జీవం పోశారు. రేమట ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన నడుస్తుండగా, మిగతా 3 ఎత్తిపోతల పథకాల కింద పోలకల్, యనగండ్ల, గుండ్రేవుల, కొండాపురం, పల్‌దొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె, కె.సింగవరం, మునగాల గ్రామాల్లో 10902 ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సాగు నీరు అందుతోంది.

ఒకప్పుడు వర్షాధారంపైనే ఆధారపడి జీవస్తున్న రైతులు నేడు ఎత్తిపోతల పథకంతో ఏడాదికి రెండు పంటలను రైతులు పండించుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ నిర్మాణంతో ఆ ప్రాంతాల్లోని పంట పొలాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఎకరా ధర వేలల్లో ఉండగా, నేడు లక్షలాది రూపాయలకు చేరింది. సి.బెళగల్ నుంచి పోలకల్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్లకాలం పచ్చటి పొలాలతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ఎత్తిపోతల పథకాల కింద వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జీవన స్థితి మారిపోయింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోత కారణంగా నీళ్లు ఎత్తిపోసే సమస్య రావడంతో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఆ రోజులు మళ్లీ ఎప్పుడు వస్తాయో: రామాంజనేయులు, రైతు
రైతులకు రాజశేఖర్ రెడ్డి ఎంతో మేలు సేసినాడు. ఆయన బతికున్నప్పుడు పొలానికి నీళ్ల సమస్య ఉండేది కాదు. ఇప్పుడు కరెంటు రాదు, పొలాల్లోకి నీళ్లు పారవు. రాత్రీపగలూ తిరిగినా ఎకరా పొలం తడవదు. సంఘమోళ్లు ఎకరాకు రూ. 700 కట్టించుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం నీళ్లు రావని బోరుతోనే సేను తడుపుకుంటున్నాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!