వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళ, బుధ వారాల్లో ఆదోని పట్టణం, పరిసర గ్రామాల్లో సాగనుంది. పాదయాత్రకు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఆదోనిలో పూర్తిస్థాయిలో పాదయాత్ర ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం ఆదోని సమీపంలోని మిల్టన్ స్కూల్ నుంచి పాదయాత్ర ప్రారంభమై కొత్త బస్టాండ్, నిర్మల టాకీస్ రోడ్, వీబీఎస్ సర్కిల్, శ్రీనివాస భవన్ సర్కిల్, ఏరియా హాస్పిటల్ వరకు మధ్యాహ్నం చేరుకుంటుంది.
అక్కడ మధ్యాహ్న భోజనాలు పూర్తయిన తరువాత చత్తా బజార్ రోడ్, పీఎన్ రోడ్, జామియా మసీద్, పూల్ బజార్, గణేష్ సర్కిల్, మీటర్ మజీద్ రోడ్డు, అవన్నపేట స్కూల్, ఎమ్మిగనూరు రోడ్డుకు చేరుకుంటుంది. రాత్రి అక్కడ బస చేసి బుధవారం ఉదయం అక్కడి నుంచి చిన్నపెండెకల్ క్రాస్, బిచెగిరి క్రాస్, మీదుగా కపాటి, రంగాపురం చేరుకుంటుంది. మంగళవారం ఆదోని పట్టణంలో 9.5 కిలోమీటర్లు సాగే పాదయాత్ర బుధవారం 13 కిలోమీటర్లు సాగనుందని రఘురాం, గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment