గత ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ గురువారం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. పాదయాత్ర సాగుతున్న కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండల కేంద్రానికి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వచ్చిన ఆయన్ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన ఐటీ శాఖ మాజీ కమిషనర్ పార్థసారథి పార్టీలో చేరారు. అలాగే తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా మాజీ కోశాధికారి సోమిశెట్టి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఆయన రెండు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, జిల్లా కోశాధికారి పదవికి రాజీనామా చేశారు. టీడీపీ నాయకుల తీరు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పార్టీలో చేరిన సందర్భంగా ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఈయన సోదరుడు.
షర్మిలకు ఎమ్మెల్యేల సంఘీభావం
కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల) జిల్లాలోని పెద్దకడబూరు మండలంలో షర్మిలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), వై. బాల నాగిరెడ్డి(మంత్రాలయం), పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.
source:sakshi
No comments:
Post a Comment