వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఈ భేటీ జరిగింది. వీరు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని ఆపార్టీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నా చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. |
No comments:
Post a Comment