పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో నాలుగు గ్రామాల్లో పోలింగ్ ని బహిష్కరించారు. మిగిలిన ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. బుట్టాయిగూడెం మండలంలోని గుమ్మలూరు, లంకపాకల, చింతపల్లి, రెడ్డి కోపల్లి గిరిజన గ్రామాల్లో న్యూడెమోక్రసి పిలుపు మేరకు ప్రజలు పోలింగ్ ని బహిష్కరించారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత కరాటం రాంబాబు వర్గాన్ని టిడిపి తనకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ ఓట్లు వేయించుకునే పనులు ప్రారంభించింది. టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు, రాంబాబు గ్రూపు మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నాయకుల అక్రమాలు, ఆగడాలు ఎలా వున్నా మహిళా ఓటర్లు అందరికంటే ముందుండి ఓటు వేస్తున్నారు. ఈ నియోజవర్గంలో లక్షా 72వేల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళా ఓటర్లే అధికం.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment