లక్ష్మీపేట ఘటనకు మంత్రి కొండ్రు మురళి నైతిక బాధ్యత వహించాలని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. లక్ష్మీపేట ఘటనకు నైతిక బాధ్యతగా తక్షణమే మంత్రి కొండ్రు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులపై దాడిచేసినవారిని తక్షణం అరెస్ట్ చేయాలని సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి నల్లా సూర్యప్రకాశ్ సూచించారు.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని లక్ష్మీపేట గ్రామంలో మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ముంపు మినహా మిగులు భూముల వివాదంపై మంగళవారం జరిగిన కొట్లాటలో నలుగురు దళితులు మృతి చెందారు. మరో 31 మంది గాయపడ్డారు. ఇరువర్గాలు నాటుబాంబులు, కర్రలు, గొడ్డళ్లు, బల్లేలు, కత్తులు తదితర ఆయుధాలు ఉపయోగించి పరస్పర దాడులకు దిగారు.

No comments:
Post a Comment