గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్ధుర్తి గ్రామంలో ఎన్నికల సరళిని కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి రిపోర్టర్ రమేశ్, కెమెరామెన్ పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. రిపోర్టర్ పై దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారు. తనపై దాడిని డీఎస్పీ వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన రిపోర్టర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సమస్యాత్మక ప్రాంతమైన వెల్దుర్తిలో పరిస్టితిని రిపోర్టింగ్ చేయాడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధిని పోలీసులు అడ్డుకున్నారు. మీడియానే అనవసరంగా ఉద్రిక్తతను పెంచుతుందని డీఎస్పీ దురుసుగా ప్రవర్తించారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని .. మీడియా ప్రవేశించారని ఆంక్షలు విధించారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రత్యక్ష ప్రసారం ఉందని తెలిసి కూడా డీఎస్పీ తన హోదాను మరిచి.. మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment