వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సాధారణ వ్యాన్‌లో కోర్టుకు తరలించడాన్ని మాజీ మంత్రి పి.శంకర్రావు తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలవల్ల హైకమాండ్‌కు, ప్రభుత్వానికి చెడ్డపేరొస్తుందని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ఎంపీ... ఓ పార్టీకి అధ్యక్షుడు. జడ్‌ప్లస్ భద్రత కలిగి హిట్‌లిస్టులో ఉన్న వ్యక్తి. పైగా ఆయన దోషి కూడా కాదు. అభియోగాలున్న నిందితుడు మాత్రమే. అలాంటి నాయకుడిని సామాన్య వ్యక్తి మాదిరిగా కామన్ వ్యాన్‌లో తరలిస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment