విడిపించుకుపోయిన ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ అభ్యర్థి
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం
చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గంలో.. కాంగ్రెస్ నేతలు పోలింగ్ ముగిసే వరకూ కూడా డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రెండు రోజుల కిందట ఓటుకు రూ. 1,000 చొప్పున పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు.. మంగళవారం పోలింగ్ కేంద్రాల వద్ద అదనంగా మరో రూ. 1,000 చొప్పున డబ్బులు పంచారు. నిమ్మకాయల వీధిలోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ టి.కె.బ్రహ్మానందం ఓటర్లకు రూ. 1,000 నోట్లు పంపిణీ చేస్తుండగా శిక్షణలో ఉన్న ఎస్‌పీ విశాల్, డీఎస్‌పీ హనుమంతు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 81,560 స్వాధీనం చేసుకుని ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. ఎంపీ చింతామోహన్, కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి, తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసి.. బ్రహ్మానందంను విడిపించుకుని వెళ్లారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశించి ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని కాంగ్రెస్ నేతలకు సహకారం అందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ స్టేషన్ల సమీపంలోనే తిష్టవేసి ఓటు వేయడానికి వచ్చిన వారికి అదనంగా వెయ్యి రూపాయలు ఇచ్చి హస్తానికి ఓటు వేస్తామని ప్రమాణాలు చేయించుకున్నారు. శెట్టిపల్లెలో మాజీ సర్పంచ్ మునికృష్ణ ఈ తరహా రాజకీయం చేస్తుండగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ తరుణంలో జరిగిన గొడవలో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుడు రుద్రగోపితో పాటు మరికొందరు కార్యకర్తలను అరెస్టు చేసి కాంగ్రెస్ వారిని వదిలేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సత్యనారాయణపురంలో, ఇమామ్‌ను చెన్నారెడ్డి కాలనీ బూత్ వద్ద, బొమ్మగుంట రవిని నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ముత్యాలరెడ్డిపల్లెలో మాజీ ఎంపీపీ తిరుమలయ్య, మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు వెంకటమునిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

No comments:
Post a Comment