భారత రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరింత సంచలనం తోడయ్యే అవకాశముంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మాజీ లోకసభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, ఉప రాష్ట్రపతి పదవికి సుభాష్ చంద్రబోస్ సోదరుడి కోడలు కృష్టాబోస్ పేర్లను మమతా బెనర్జీ సూచించే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగానే భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటి కానున్నారు. పశ్చిమ బెంగాల్ కు ఇవ్వనున్న ఆర్ధిక ప్యాకేజీ, యూపీఏ భాగస్వామ్య పక్షాల తరపున పోటీలో నిలిపే రాష్ట్రపతి అభ్యర్థిత్వం లాంటి అంశాలు ప్రధాని, మమతాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.
మమతా బెనర్జీని ప్రధాని ఆహ్మనించినట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీతో మమతా బుధవారం సమావేశమయ్యారు.

No comments:
Post a Comment