ఎన్నికల్లో అవినీతి పెరుగుతోదంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రావణ్ ఎద్దేవా చేశారు.
రాజకీయాన్ని రియల్ ఎస్టేట్ దందాగామార్చిన వ్యక్తి బాబు అని శ్రావణ్ ఆరోపించారు. నోటు పెట్టి ఓటు కొనుక్కోవచ్చన్న సంస్కృతికి పునాదులు వేసింది బాబేనని ఆయన మండిపడ్డారు. ఆయనపై కేసులు వచ్చినప్పుడు ఎదుర్కోలేకుండా స్టే తెచ్చుకున్నారని.. బాబారామ్‌దేవ్.. చంద్రబాబును కలిసి ఉద్యమిస్తాననడం దుర్మార్గమన్నారు.
బ్రహ్మణి తరహాలోనే ఎమ్మార్ కేటాయింపులు రద్దు చేసి రైతులకు భూములు అప్పగించాలని శ్రావణ్ డిమాండ్ చేశారు. వాన్‌పిక్ రద్దు కోసం మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉద్యమాలు చేస్తున్నారని.. ఎమ్మార్ విషయంలో తెలంగాణ మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

No comments:
Post a Comment