ఉప ఎన్నికల సందర్భంగా పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర బలగాలను ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈసారి అలాలేదని, కొన్ని కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేవని ఆమె తెలిపారు. గీసుకొండ మండలం వంతెనగిరి గ్రామంలో ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు మొత్తం మీద సంతృప్తికరంగానే వున్నాయన్నారు. వృద్ధులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. |
Tuesday, 12 June 2012
సెక్యూరిటీపై అనుమానాలు: సురేఖ
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment