ఉపఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందని గట్టు రామచంద్రారావు అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ప్రజలు కసిగా ఓటింగ్‌లో పాల్గొని కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పారు అని వ్యాఖ్యానించారు.
పరోక్షంగా కాంగ్రెస్, టీడీపీలు ఓటమిని అంగీకరించాయని ఆయన అన్నారు. లగడపాటి .. పిట్టలదొరలా కబుర్లు చెబుతున్నారని గట్టు విమర్శించారు. దమ్ముంటే ఎంపీ పదవికి లగడపాటి రాజీనామా చేసి గెలవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా బయటపడిందన్నారు. మానవీయ విలువలు మరిచి నీతిమాలిన ప్రచారం కాంగ్రెస్, టీడీపీలు చేశారని.. ప్రజాభిప్రాయాన్ని జైలు గోడల మధ్య దాయాలని యత్నించారని గట్టు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సైకిల్ కాంగ్రెస్‌గా పేరు మార్చుకోవాలి గట్టు ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment