కొవ్వూరు (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు టీడీపీ సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) తెలిపారు. ఆయన తన స్వగ్రామం దొమ్మేరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తనతోపాటు పలువురు నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.
ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో తాను, తన అనుచరులు, స్థానిక నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరతామని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తారనే విశ్వాసం తనకు ఉందని, అందువల్లే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. సన్నిహితులతో చర్చించి త్వరలోనే పార్టీలో చేరే తేదీని, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని ప్రకటిస్తానని కృష్ణబాబు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు కొయ్యే మోషేన్‌రాజు, పార్టీ నాయకులు కొవ్వూరు నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి కృష్ణబాబును కలిశారు. పార్టీలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=465673&Categoryid=1&subcatid=33

No comments:
Post a Comment