న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేజ్రీవాల్ పేల్చిన 'డీఎల్ఎఫ్ - వాద్రా బాంబు' దెబ్బకు విలవిల్లాడుతున్న కాంగ్రెస్‌పై... ఇప్పుడు 'ప్రియాంకా బాంబు' కూడా పడింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ప్రియాంకా గాంధీకి కోట్ల విలువైన ఆస్తులున్నాయనే సమాచారం బయటపడింది. సిమ్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఛర్బ రా అనే గ్రామంలో ప్రి యాంక ఓ భారీ భ వంతి నిర్మిస్తున్నా రు. 2007లోనే ఆ మె అక్కడ ఒక ఎక రం స్థలం కొన్నారు.
నిజానికి... హిమాచల్ ప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల వారు వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. కానీ... అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రియాంక కోసం నిబంధనలు సడలించింది. ఎకరం భూమిని రెండు విడతల్లో ప్రియాంక సొంతం కాగా... ఒక విడత కాంగ్రెస్ హయాంలో జరిగింది. తర్వాత వచ్చిన బీజేపీ సర్కారూ అదే దారిలో ప్రయాణిస్తూ ప్రియాంకకు మే లు చేసింది. ఇప్పుడు ఈ వివాదాన్ని బీజేపీకే చెందిన సీనియర్ నేత, పార్టీ ఉపాధ్యక్షుడు, హిమాచల్ మాజీ సీఎం శాంతకుమార్ లేవనెత్తడం గమనార్హం.
'మీ జాబితాలో దీనిని కూడా చేర్చండి' అంటూ శాంతకుమార్ తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ధుమాల్‌ను ఇ బ్బంది పెట్టడమే ఆయన అంతర్గత అజెండా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాంతకుమార్, ధుమాల్ వర్గాల మధ్య కొన్ని నెలలుగా వర్గ పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ శాంతకుమార్‌పై చెణుకులు విసిరారు. "ప్రియాంక ఆస్తులపై తమ వద్ద సమాచారం లేదని శాంతకుమార్ అంటున్నా రు. ఇదేంటో మాకు అర్థం కావడంలేదు. సిిమ్లాలో ప్రియాంకకు ఆస్తి ఉందో, లేదో శాంతకుమార్, ఆ రాష్ట్ర సీఎం ధుమాల్ తేల్చాలి'' అని కేజ్రీవాల్ బంతిని వారికోర్టులోకే నెట్టారు.
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/oct/9/main/9main8&more=2012/oct/9/main/main&date=10/9/2012

No comments:
Post a Comment