కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ అల్లుడు రాబర్ట్ వద్రాకు సంబందించి చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది.ప్రైవేటు లావాదేవీలపై కేంద్రం దర్యాప్తు చేయబోదని ఆయన చెబుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తరపున డి.ఎల్.ఎఫ్ కు లాభం లేదా మేలు జరిగేలా రాబర్ట్ వద్రా పలుకుబడి ఉపయోగపడిందని,దానికి ప్రతిఫలంగా వద్రాకు డి.ఎల్.ఎఫ్ ఆస్తులను కేటాయించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాని చిదంబరం మాత్రం అది ప్రైవేటు వ్యవహారం అని చెబుతున్నారు.తనదాకా వస్తే కాని నొప్పి తెలియదని అంటారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ విసయంలో పోటీపడి క్విడ్ ప్రోకో అంటూ విచారణ జరుపున్న సంగతిని మర్చిపోయి చిదంబరం మాట్లాడుతుండడం విశేషం. జగన్ కేసు విషయంలో ఒకరకంగాను, వద్రా కేసులో మరో రకంగాను వ్యవహరించడాన్ని జనం గమనించరని అనుకుంటే పొరపాటు. కాగా వద్రామీద ఆరోపణలు చేస్తే అది కాంగ్రెస్ మీద చేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. అందులో అనుమానం ఏముంది.కచ్చితంగా ఇది పరోక్షంగా సోనియాగాంధీపైనేఈ విమర్శలు చేసినట్లు అవుతుంది. నిజంగా వద్రా తన పలుకుబడిని ఉపయోగించాడా?లేదా? పెద్ద ఎత్తున సంపద కూడబెట్టాడా? లేదా అన్నది చర్చనీయాంశం. అంతేకాని కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పి తప్పుకోవచ్చనుకుంటే కష్టం.కనుక చిదంబరం చేసిన వాదనను ప్రజలు సమర్ధించడం కష్టమే.
source: kommineni
source: kommineni
No comments:
Post a Comment