న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వీఎస్ సంపత్ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జూన్ 16 తేదిన జారీ అవుతుందని.. నామినేషన్ల దాఖలుకు చివరి తేది జూన్ 30 తేది అని తెలిపారు. జూలై 2 తేదిన నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జూలై 4. రాష్ట్రపతి ఎన్నిక కోసం జూలై 19 తేదిన పోలింగ్ జరుగుతుందని, జూలై 22 తేదిన కౌంటింగ్ జరుగుతుందని వీఎస్ సంపత్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో 4896 మంది ఓటు వేయనున్నారని.. అందులో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment