విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే సగం జోకర్, సగం బ్రోకర్ లా ఉందని వైఎస్ఆర్ సీపీ నేత తలశిల రఘురాం అన్నారు. లగడపాటి వ్యాఖ్యలను రఘురాం తప్పుపట్టారు. షర్మిలా ఎక్కడా కన్నీళ్లు పెట్టుకోలేదని.. వాస్తవాల్ని చెప్పారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వారే కన్నీళ్లు పెట్టుకుంటారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జనం జగన్ ను నమ్మారని తలశిల రఘురాం అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment