హైదరాబాద్, జూన్ 12: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను దక్కించుకోనుంది. కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య, మరికొన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య హోరాహోరీ పోరు సాగింది. కాగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతు కానున్నాయని ఉప ఎన్నికలు జరిగిన జిల్లాలకు చెందిన ఆంధ్రభూమి ప్రతినిధులు పంపించిన సమాచారం మేరకు తెలుస్తోంది. వరంగల్ జిల్లా పరకాలలో తెరాసకే మొగ్గు కనిపిస్తోంది.
పాయకరావుపేట, పోలవరం, పత్తిపాడు, రాయదుర్గం స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య నువ్వానేనా అన్న పోటీ సాగింది. వీటిలో కొన్నిచోట్ల తెలుగుదేశం పార్టీకి, కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్‌కు మొగ్గు కనిపిస్తోంది. ఇక రామచంద్రాపురం, నర్సాపురం, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, ఆళ్ళగడ్డ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, మరికొన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. నర్సాపురం, రామచంద్రాపురం స్థానాల్లో కాంగ్రెస్‌కు మొగ్గు కనిపిస్తోంది. తిరుపతి ఫలితం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు ఉంది. ఇక్కడ ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యమే లభించే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు మూడు స్థానాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించనుంది. ఆళ్ళగడ్డలో తెలుగుదేశం పార్టీకి, మాచెర్లలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ జిల్లా పరకాలలో తెరాసకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. నువ్వా నేనా రీతిలో సాగిన ఇక్కడి ఎన్నికలో తెరాసకే కొంత మొగ్గు కనిపిస్తోంది.
ఇక నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ లభించనుంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు గట్టిపోటీని ఇవ్వకలేక పోయాయి.

No comments:
Post a Comment