అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై అరెస్టై చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబసభ్యులు కలిశారు. మంగళవారం మధ్యాహ్నం జైలు వద్దకు చేరుకున్న జగన్ భార్య భారతి, సోదరి షర్మిల, బావ అనిల్ లోనికి వెళ్ళి జగన్‌తో మాట్లాడారు. ప్రధానంగా ఉప ఎన్నికల గురించే వీరు మాట్లాడుకుటున్న తెలిసింది. ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, విజయావకాశాలను జగన్ ఆసక్తిగా ఆలకించారు. దాదాపు అరగంట సేపు వీరి సంభాషణలు కొనసాగిన అనంతరం జగన్ కుటుంబసభ్యులు తిరిగి వెళ్ళిపోయారు. జైలు అధికారులు కూడా ఉప ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జగన్ పార్టీ జయకేతనం ఎగురవేస్తే ఆయన రాష్ట్రంలో కింగ్‌మేకర్ అవుతాయనే ఊహాగానాలు బలపడడంతో ఇకపై జగన్‌ను ‘జాగ్రత్తగా’ చూసుకోవాలనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. జగన్‌తో పాటు శిక్ష అనుభవిస్తున్న ఇతర విఐపిలు కూడా ఆసక్తిగా పోలింగ్ సరళిని వీక్షించినట్లు సమాచారం. మొత్తానికి ముఖ్య ఘట్టమైన పోలింగ్ మంగళవారం ముగియడంతో జగన్‌కు టెన్షన్ రిలీఫ్ అయినట్లు కనిపించింది. అధికారులతో, ఇతర విఐపిలతో ఆయన చాలా ఉల్లాసంగా మాట్లాడారు. పోలింగ్ సరళిని గమనించాక ఆయనలో గెలుపు ధీమా పెరిగిందని జైలు వర్గాలు తెలిపాయి.
source: andhrabhumi news
source: andhrabhumi news
No comments:
Post a Comment