పోలింగ్ స్టేషన్లలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు ఓటర్లు తీసుకురావద్దొని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. అయితే సెల్ ఫోన్ ని అనుమతించకపోవడంతో చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేయకుండా తిరిగి వెళ్లి పోతున్నారు. ప్రస్తుతం సెల్ అందరికీ అత్యంత అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరంగా మారిపోయింది. వయసుతో సంబంధంలేకుండా అందరి దగ్గర సెల్ ఉంటుంది. సెల్ కి అలవాటుపడిపోయినవారు ఒక గంటసేపు దానిని దూరంగా ఉంచడానికి ఇష్టపడరు. బాధ్యతగా ఓటువేయడానికి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినా సెల్ ని అనుమతించకపోవడంతో చాలా మంది అయిష్టంగానే ఓటువేయకుండా వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.
Monday, 11 June 2012
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment