ఒంగోలులో ఇద్దరు పోలింగ్ అధికారులను విధుల నుంచి తొలగించారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఇద్దరు అధికారుల వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పసిగట్టింది. విధుల నుంచి వారిని తొలగించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 60వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఎవరు వెళ్లినా వారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుండడాన్ని వెబ్ లైవ్ ద్వారా హైదరాబాద్‌లో పర్యవేక్షిస్తున్న అధికారులు గమనించారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment