వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో.. చిన్నమండెం మండలం నాగూరువాండ్లపల్లె వద్ద జడ్‌పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డిని చూసిన కాంగ్రెస్ నాయకులు బాబురెడ్డి, రాంప్రసాద్‌రెడ్డిలు దూషణల పర్వం కొనసాగించడంతోపాటు ఎన్నికల అనంతరం చంపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు సిద్ధం కావటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. లక్కిరెడ్డిపల్లెలో టీడీపీ నేత శశినాయక్ ఇంటిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాళ్లతో దాడి చేశారు.

రామాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఏజెంటును కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేయగా..స్థానికులు, పోలీసుల జోక్యంతో వదిలిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి స్వగ్రామం రెడ్డివారిపల్లెలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇతర పార్టీలకు ఏజెంట్లు లేరు. ఓటర్లను పోలింగ్‌కు అనుమతించిన బూత్ లెవెల్ ఆఫీసర్ రజియాబీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు వేయించటంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విమర్శలకు దిగారు. బూడిదగుంటపల్లెలో కూడా కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలకు ఏజెంట్లు లేక ఏకపక్షంగా పోలింగ్ సాగింది.
No comments:
Post a Comment