‘‘టీడీపీ అధినేత చంద్రబాబు ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడని తెహల్కా డాట్ కామ్ తేల్చి చెప్పింది. అన్ని వ్యవస్థలను ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి తన పబ్బం గడుపుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ బ్రిటన్ సంస్థ వెల్లడించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చంద్రబాబును అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టిన బాబా రాందేవ్ మద్దతు కోరడం చాలా విచిత్రంగా ఉంది. చంద్రబాబు బాగోతాలను ఆయన సన్నిహితుడు కోలా కృష్ణమోహన్ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయాలను రాందేవ్ తెలుసుకోవాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విదేశాల్లో సి.నాయుడు నారా పేరుతో అకౌంట్లున్న వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల ప్రజలకు రాందేవ్ తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందన్నారు. బాబా రాందేవ్‌కు చంద్రబాబు అసలు రూపం తెలిస్తే ఒక్క క్షణం నిలవకుండా ఢిల్లీ పారిపోతారని చెప్పారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా బయటినుంచి ఒక వ్యక్తిని రప్పించుకొని అతనితో ఫొటోలకు పోజులివ్వడం చంద్రబాబు నైజమని... తాజాగా కోలా కృష్ణమోహన్ ఆరోపణల నేపథ్యంలో భాగంగానే బాబా రాందేవ్‌ను రప్పించుకున్నారని విమర్శించారు. ‘‘కేజీ బేసిన్‌లో రూ.లక్షా యాభైవేల కోట్ల విలువ చేసే చమురును చంద్రబాబు రిలయన్స్‌కు దోచిపెడితే ఒక్క కథనం కూడా ప్రసారం చేయదు. ఎకరం 4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.29 లక్షలకే ఎమ్మార్‌కు కేటాయించినా తప్పుగా కనపడదు. బాబు హవాలా బాగోతాలను కృష్ణమోహన్ ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రజలకు చూపించరు’’ అని మీడియా వైఖరిని గట్టు తప్పుబట్టారు. అదే జగన్ గురించి ఎవరేం చెప్పినా ఇదే మీడియా పూనకం వచ్చినట్లు ఊగిపోతుందన్నారు.





No comments:
Post a Comment