YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 8 October 2012

ఆ ప్రత్యేకతే ప్రజల్ని ఆకర్షించింది

ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికీ ప్రధాని అయ్యే 

హక్కు ఉంది..

అలాగే "జననేత" జగన్ ముఖ్యమంత్రి కావాలని 

కోరుకోవడం ఏరకంగా తప్పో నాకు అర్ధం కాదు..?

సీనియర్ల చెప్పు కింది తేలులా ..కాలికింది చెప్పులా 

బతుకీడుస్తూ.. కాలం కలిసొస్తే పదవి పొందాలికానీ.. 

స్వయంగా ఏ ఉన్నత పదవిని ఆశి౦చకూడనే ఏకసూత్ర 

వ్యతిరేకతతో.. కాంగ్రెస్ కాదంటే సొంతగా పార్టీ 

పెట్టుకోవడమే "జనం మనిషి" జగన్ చేసిన 

తప్పనుకోవాలా..?

నిజానికి ఆయన కాగ్రెస్ లో ఉండి ఉంటే.. ఈ పాటికి ఏ కేంద్ర మంత్రి పదవో.. రాష్ట్ర స్థాయి పదవో దక్కి ఉండేది.. 

కాంగ్రెస్ మందలో ఒకడిగా కాలక్షేపం చేస్తుండేవారు..

మందలో ఒకడిగా "జనహితనేత " జగన్ కలిసిపోవాలనుకోలేదు.. 


నిజం చెప్పాలి అంటే ఆయనలోని ఆ ప్రత్యేకతే ప్రజల్ని ఆకర్షించింది.. 

తనకు తానుగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. లక్ష్య సాధన దిశగా నిరంతరం శ్రమించడం..ఇటు కాంగ్రెస్ కు అటు 

టిడిపికి ఏమాత్రం నచ్చడంలేదు.. 

నాయకులు తన పెంపుడు కుక్కల్లా బతకాలనేది టిడిపి అధినేత "గడాఫీ" అభిమతం.. తన చెప్పుచేతల్లో అణిగి 

మణిగి పడుండే వెన్నెముకలేని జీవులు కావాలాయనకి..!

అధికారం రుచి చూసిన గుంటనక్కల్లా ఈ ఉభయ పార్టీల నాయకులు ఓట్ల బేరాలతో కాట్లాడుకు౦టు౦టే.. ?

జనానికి మూడో ప్రత్యామ్నాయంగా జనహృదయ నేత రూపంలో జగన్ కనిపించడంలో ఆశ్చర్యం ఏముంది..? 

జగన్ ఇప్పటివరకూ కేవలం ఓ ప్రజాప్రతినిధి మాత్రమే..ఆయన ఏ పదవిలోనూ లేరు..అధికార దుర్వినియోగం 

చేసిన దాఖలాలూ లేవు.. 

సిబిఐ నాటకం గానీ.. పచ్చ రాతల గీతాలు కానీ ప్రజల్ని ఎమార్చలేవని తొందర్లోనే అందరికీ అర్ధం 

అవుతుంది..ఇప్పటికే అర్ధం ఐ ఉంటుంది అనుకోండి ..

స్వాతంత్రానంతర కాలంలో నాలుగో తరాన్ని చూస్తున్నాం.. వసుధైక కుటుంబంలో వెల్లువెత్తిన మానవ మేధో 

వికాసాన్ని చూస్తున్నాం..

ఈదశలోనూ నిప్పేదో.. నీరేదో తెలుసుకోలేని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటే..

అంతకన్నా అమాయకత్వం మరోటి ఉండదు..

ఇప్పటికీ ఇదే బిసి నాటి మనస్తత్వం కాంగ్రెస్, టిడిపిల్లో కనిపిస్తోంది.. 

జంకూ బొంకూ లేకుండా ఓట్ల కోసం నోటికొచ్చిన మాటల ఈటెలు విసిరితే.. సగటు మనిషి సవాలు 

చేయకపోవచ్చు..! 

సత్యమేదో… అసత్యమేదో తెలుసుకోలేకపోడుకదా…?

ఇప్పటికే ఈ రెండేళ్ళ కాలంలో చాలా సార్లు ఓటర్లు తీర్పిచ్చారు.. ఎన్నికలోచ్చిన ప్రతిసారీ ప్రజలు నిక్కచ్చిగా తమ 

అభిప్రాయం తేల్చి చేబుతున్నా.. నిస్సిగ్గుగా నేతలు మాత్రం ఓట్ల బిక్షాటనలో.. తలమునకలై రోడ్లపైకి వస్తూనే 

ఉన్నారు.. 

జగన్ అక్రమంగా ఆస్తులు సంపాయి౦చాడ౦టూ వీరంతా వేసిన అభియోగాలను ప్రభుత్వ రంగ సంస్థలు, కోర్టులు 

విచారిస్తున్నాయి..

ఆయన దోషని తేలలేదు..అభియోగాలన్నీ అబద్ధాలని ప్రజలు అర్ధం చేసుకునే రోజు చాల దగ్గరగా ఉంది..

విచారణ పూర్తయ్యేదాకా ఆగితే ఏ అనర్ధం జరిగి పోతుందో అనే భయం వీరిని వెన్నాడుతున్నట్టుంది.. 

అందుకే.. ఏదో జరిగి పోవాలి.. 

ఇంతింతై వటుడింతై.. అన్నట్టు ఎదుగుతున్న "జనం మనిషి" జగన్ రాజకీయ క్షెత్ర౦ నుంచి తప్పుకోవాలి.. 

రాష్ట్రంలోని అధికార పక్ష౦, ప్రధాన ప్రతిపక్ష౦ ఒక్కటై ..మూకుమ్మడి దాడికి తెగబడినా.. జనం మాత్రం జన 

ప్రేమికుడు జగన్ వెంటే పరుగులు తీస్తున్నారు..


అతనికి రాజకీయఅనుభంలేకపోవచ్చు..

పాలనానుభావం లేకపోవచ్చు.. 

కానీ అధికారం కోసం జనం వెంట పరుగులు తీసి.. పదవిలోకి వచ్చాక పంగనామాలు పెట్టిన "బాబు" గారి లాంటి 

చరిత్ర మాత్రం లేదు.. 

ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అదే.. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఆట ఆడుతున్నపుడు విసిగిపోయిన జనం ఎన్టీయార్ వైపు మొగ్గుచూపారు..

గడాఫీ జన వ్యతిరేక పాలనను చూసిన తెలుగు ప్రజలు మహానేత పేదల దేవుడు "రాజన్న" వైపు మొగ్గారు ..

చరిత్ర పునరావృతం అవుతోంది.. 

అధికార ప్రతిపక్షాలు రెండూ అసమ్మతి సెగల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.. 

ఇప్పుడు జననేత జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటే పటిష్టంగా కనబడుతోంది.. 

ఒకసారి అవకాశం ఇచ్చిచూద్దాం అనుకుంటున్న ప్రజలు నిస్సందేహంగా మూడో ప్రత్యామ్నాయం వైపు 

చూస్తున్నరన్నది నిఖార్సైన నిజం..

వొచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి పక్షాలకు ధరావత్ దొరికితే అదో పెద్ద వింతే ..

జై జగన్ ..

జోహార్ రాజన్న ..

లాంగ్ లైవ్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ....

- from   Saraswati Narayana Raju profile

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!