కొవ్వూరు (పశ్చిమగోదావరి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో త్వరలో ఆ పార్టీలో చేరనున్నట్లు టీడీపీ సీనియర్ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) తెలిపారు. ఆయన తన స్వగ్రామం దొమ్మేరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. తనతోపాటు పలువురు నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో తాను, తన అనుచరులు, స్థానిక నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరతామని చెప్పారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment