అతడు ఒక్కడు కాదు... అనేకం... వేలు, లక్షలు, కోట్లు.. అతడి చుట్టూ ప్రజలున్నారు. ‘అతడంటే ప్రజలు, ప్రజలంటే అతడు’. కాంగ్రెస్ ఒట్టి కాంగ్రెస్సే, కాని జగన్‌ది ‘వైయస్సార్’ కాంగ్రెస్. వైఎస్ తోడుగా ఉన్న ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తికైనా ఎదురుండదు.
ప్రేమకు, స్నేహానికి, స్వచ్ఛతకి, బాధ్యతకి, పౌరుషానికి, పోరాటానికి, ఆప్యాయతకి, నమ్మకానికి, అనురాగానికి, పట్టుదలకి, ప్రజాసేవకి మారుపేరు వైఎస్. అటువంటి వైఎస్ చనిపోయినప్పుడు తనకు ఏమీ కాని ప్రజలే అంతలా బాధపడి, ప్రాణాలర్పిస్తే కన్నకుమారుడైన జగన్ ఎంత బాధపడి ఉంటారో వర్ణనాతీతం. అంతటి బాధలో కూడా ఆయన ఇచ్చిన మాటకోసం చనిపోయిన ప్రతి కుటుంబానికి ధైర్యం చెబుతూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, హైకమాండ్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అవన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చనిపోయిన వారి కుటుంబాలను ఇంటికెళ్లి పరామర్శించడం తెలుగువారి సంప్రదాయం... అని మరోమారు గుర్తుచేసిన నాయకుడు జగన్. అప్పుడే అనుకున్నారు జనం - ‘జగనే తమ లీడర్’ అని!
జగన్ ఇంతలా ప్రజాదరణ పొందడానికి కారణం... తండ్రి ఆశయాలను సాధించాలనే పట్టుదల, సహనం, ఓర్పు, మాట మీద నిలబడే తత్త్వం, విలువలు, విశ్వసనీయతలకు కట్టుబడడం ఒక ఎత్తయితే, కాంగ్రెస్ టీడీపీ కలిసి సీబీఐని పావుగా వాడుకొని ఇబ్బందిపెట్టే తీరు ఒక ఎత్తు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నేను అప్పుడప్పుడు ముసలివారిని, పేదవారిని, ఎవరైనా సామాన్య ప్రజలను... తెలియకపోయినా పలకరించి ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీస్తుంటాను ఒక సర్వేలాగా. అప్పుడు వారు ‘ఏముందయ్యా, మాకు ఎవరు మేలు చేస్తారనిపిస్తే వారి వెంటే మేమంతా’ అంటుంటారు. ఓట్లు ఎప్పుడొచ్చినా జగన్‌బాబుకే మా ఓటు అంటుంటేనే అర్థమవుతుంది - ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని. ఇదంతా చూస్తుంటే నాకనిపిస్తుంది ఒక సామాన్య మానవునికి, చిన్నపిల్లలకి ఉన్న కామన్‌సెన్స్ కూడా రాజకీయాలలో తలపండిన నాయకులకు లేదే అని. అందుకే అంటారేమో ‘కామన్‌సెన్స్ ఈజ్ నాట్ కామన్’ అని. అతడు ఒక్కడు కాదు... అనేకం... వేలు, లక్షలు, కోట్లు.. అతడి చుట్టూ ప్రజలున్నారు. ‘అతడంటే ప్రజలు, ప్రజలంటే అతడు’. కాంగ్రెస్ ఒట్టి కాంగ్రెస్సే, కాని జగన్‌ది ‘వైయస్సార్’ కాంగ్రెస్. వైఎస్ తోడుగా ఉన్న ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తికైనా ఎదురుండదనేది నా గట్టి నమ్మకం. అదే నిజం. - ఎస్.పి. కుమార్‌రెడ్డి, ఆరవీటికోట, ప్రకాశం జిల్లా
ఎదురుచూస్తున్న రోజు తొందరలోనే వస్తుంది...
వైఎస్ జగన్... ఇప్పుడు రాష్ట్రంలో ఈ పేరు చెబితే అధికార, ప్రతిపక్ష పార్టీలకు వణుకు, సామాన్య ప్రజానీకానికి మెరుపు. జగన్ పేదప్రజల ఆశాజ్యోతి. అందుకే పాలక ప్రతిపక్షాలు కలిసి అతన్ని వేధించి, సీబీఐ, ఈడీల రూపంలో ఒంటరిని చేసి ముప్పేట దాడి చేసి జైలుకు పంపి ఆనందాన్ని పొందుతున్నారు. అది తాత్కాలికం.
భగవంతుని దయ, దివగంతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులు, ప్రజల అభిమానంతో అతి తొందరలోనే ఈ చక్రబంధాన్ని ఛేదించి ప్రజల మధ్యకు వస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, రాబోయే కాలంలో జగన్‌కి అశేష ప్రజానీకం మద్దతు లభిస్తుంది. అత్యున్నత శిఖరాలను ఆయన అధిరోహిస్తాడు. అందుకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరి మద్దతునూ పొందుతాడు. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అన్నట్టు - అభిమానులంతా ఎదురుచూస్తున్న రోజు అతి తొందరలోనే వస్తుంది. అప్పటిదాకా సహనంతో ఉంటూ, సేవా కార్యక్రమాలతో ఆయన ఆశయాలను నెరవేరుస్తూ, ఆయన కుటుంబానికి అభిమానులంతా అండగా నిలవాలి. గుండెల్లో వైఎస్ కుటుంబం మీద ఉన్న అభిమానం రాబోయే ఎన్నికల్లో ప్రస్ఫుటించి, ఆ గాలిలో ఈ పాలక, ప్రతిపక్షాలు కొట్టుకుపోవడం ఖాయం. - ఎంఎన్‌వి సత్యనారాయణరాజు, రామచంద్రాపురం, మెదక్ జిల్లా |
No comments:
Post a Comment