ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కిందిస్థాయి అధికారులు పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కలిగించాలని ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ప్రయత్నిస్తుంటే...కిందిస్థాయి అధికారులు మాత్రం తప్పటడుగులు వేస్తున్నారన్నారు.
ఓటు హక్కుపై వేటు వేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని శోభా నాగిరెడ్డి ఫోన్ లో భన్వర్ లాల్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే గడువు ముగియటంతో ఏమీ చేయలేమని ఆయన నిస్సాహాయత వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment