1-8-12-13453.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రంలో డిమాండ్లు...
గతంలో దివంగత సీఎం వైఎస్ చేనేత కార్మికులకు ప్రకటించిన రూ.312 కోట్ల రుణమాఫీని అమలుచేయాలి.
నేతన్నలకు వృద్ధాప్య పింఛన్‌ను రూ.1,000కి పెంచాలి.
నూలుపై ఇన్‌పుట్ సబ్సిడీని 20 శాతానికి పెంచాలి.
చేనేత మగ్గాలకు విద్యుత్ సబ్సిడీని 75 శాతానికి పెంచాలి.
నూలు ఉత్పత్తుల మద్దతు ధరను నిర్ణయించేందుకు అమ్మకపు ధరతో పాటు మ్యాచింగ్ గ్రాంటును కలపాలి.
నేతన్నల ఉత్పత్తుల విక్రయానికి ఔట్‌లెట్‌లు ఏర్పాటు చేయాలి.
చేనేత కార్మికుల పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను వర్తింపజేయాలి.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రుణమాఫీలో లబ్ధి పొందేందుకు చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులివ్వాలి.
మగ్గాల షెడ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు గాను వడ్డీలేని రుణాలనివ్వడంతో పాటు ఆర్థిక సాయం చేయాలి.
35 కిలోల బియ్యాన్ని పొందేందుకు అంత్యోదయ కార్డులివ్వాలి.
తమిళనాడు, కేరళ తరహాలో చేనేత సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి.
నేతన్నలకు ఉద్యోగ భృతి కల్పించి, కనీస వేతనాలను అమలుపర్చాలి.
బీమా సౌకర్యాన్ని పొందేందుకు ఉన్న 58 ఏళ్ల పరిమితిని ఎత్తివేయాలి.
రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఇచ్చే అన్ని స్కూల్ యూనిఫాంలను, ప్రభుత్వ రంగ సంస్థలకు జౌళి ఉత్పత్తులన్నింటినీ ఆప్కో ద్వారానే కొనుగోలు చేయాలి.
ఆప్కోకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలి.
చేనేతకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ జౌళి విధానాన్ని అమలు చేయాలి.
No comments:
Post a Comment