... ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జిషీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసాగిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాంగ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి!
‘పెద్దవాళ్ల బొంకులు తెలియ రావు’ అని తెలుగు వాళ్లలో ఒక నానుడి. గత రెండు రోజుల్లో కేంద్రంలోని కాంగ్రెస్-యూపీఏ సర్కారు ‘విధానాల’కు ఏదో ఆకస్మికమైన కుదుపు వచ్చినట్టు కనిపిస్తోంది! చడీచప్పుడు లేకుండా ఇంతవరకూ సర్కారు అనుసరిస్తున్న ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’లో ఆకస్మిక ‘సవరణల’కు లేదా ‘సర్దుబాట్లకు కారణం ఏమై ఉంటుంది? నిజానికి అసలవి సవరణలా? కావు. ఒకే రోజున ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చెప్పినట్లు సాధికారికంగా వెలువడిన రెండు ప్రకటనలు సరికొత్త అనుమానాలకు చోటు కల్పిస్తున్నాయి.
బ్యాంకు సంస్కరణల అనంతరం బహుళజాతి కంపెనీల గుత్తపెట్టుబడులను యథేచ్ఛగా దేశంలోకి అనుమతించేందుకు వీలుగా, పరిశ్రమాభివృద్ధి పేరిట దేశీయ, విదేశీసంస్థలకు వందల వేల ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వాలు సిద్ధమ య్యాయి. సదరు కేటాయింపులూ జరిగిపోయాయి. అందుకు అనుగుణంగా చివరికి పంటపొలాలకు అనువైన సుక్షేత్రాలను కూడా బడా పారిశ్రామికులకు కట్టబెట్టడానికి వీలుగా ‘పీ.పీ.పీ.లు’ బిళ్లబీటుగా దూసుకువచ్చాయి.
అయితే ‘2-జి స్పెక్ట్రమ్’ పథకం అమలులో భారీ ఎత్తున అవినీతి కుంభకోణం బట్టబయలైన తరువాత సుప్రీంకోర్టు ఒక విశిష్టమైన తీర్పు చెప్పింది. ‘సహజ వన రులు దేశం సంపద కనుక’ కొలదిమంది దానిని కొల్ల గొట్టుకుని పోవడానికి అనుమతించేది లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ‘కుడితిలో పడిన ఎలుక’ చందంగా మారింది. అయితే తాజాగా మన్మోహన్‌సింగ్ ‘రూటు’ మార్చినట్టు కనిపిస్తూ తిరిగి భూబదలాయింపులను మరింత సులభ తరం చేయడానికే నిర్ణయించుకున్నారు. ఇందుకు తగినట్టు గానే గుంభనంగా ఆయన ప్రభుత్వం సుప్రీంలో వాదించ డానికి ముందు చేసిన పని - ఎగ్జిక్యూటివ్ చేసే నిర్ణయా లలో న్యాయస్థానాల జోక్యాన్ని మెత్తగానే అయినా మంద లించడానికి పూనుకుంది. విదేశాలతో కుదుర్చుకునే ఏ ఒప్పందాలైనా లెజిస్లేచర్ అనుమతిలేకుండా పాలకులు ఆమోదించడానికి వీల్లేదని రాజ్యాంగం నిర్దేశిస్తోంది.
ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను ఒక ప్రభుత్వ శాఖ నుంచి మరొక ప్రభుత్వశాఖకు బదలాయించుకో వచ్చే తప్ప ఏ ఇతర సంస్థకూ బదలాయించడంపై ప్రభు త్వం నిషేధం విధించింది. కానీ కథ ఇప్పుడు మళ్లీ మొద టికి వచ్చింది! మౌలిక సౌకర్యాల కల్పనకు తోడ్పడే ప్రైవే ట్ రంగానికి ప్రభుత్వ భూములను బదలాయించడంపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ప్రధాని (ఆగస్టు 2వ తేదీన) తాజాగా ప్రకటించేశారు! మౌలిక సౌకర్యాల కల్ప నకు ముందుకు దూసుకువస్తున్న పథకాలకు సంబంధించి ముఖ్యంగా ‘ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం’తో (పీపీపీ-పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్) నిర్వహించే పథకాల విషయంలో రాయితీలు కల్పించడంలో ఇంతవరకూ అం తూపొంతూ లేకుండా జరుగుతున్న జాప్యాన్ని తొలగించ డానికే ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఉన్న ఆంక్షలను తొలగించాలని నిర్ణయించారు! దీని ప్రకారం, అన్ని పీపీపీ ప్రాజెక్టులకూ ఈ సడలింపు వర్తిస్తుంది.
‘పీపీపీ అప్రూవల్ కమిటీ ద్వారా సంబంధిత మంత్రుల సమ్మతిలోగాని లేదా సంబంధిత మంత్రి మండలి అనుమ తితో సదరు ప్రభుత్వ భూముల్ని కౌలుకిగాని లేదా అద్దెకు గాని లేదా లెసైన్సుపైనగానీ రాయితీలపైన బదలాయిం చడం లేదా కేటాయించడం జరుగుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రాజెక్టులను వేగాతివేగంగా పూర్తిచేసేందుకు వీలుగా సర్కారు భూములను ప్రైవేట్ సంస్థలకు కేటా యించేందుకు సంబంధించిన నియమ నిబంధనలను సడ లించేయడానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం నిర్ణయిం చింది. నిజానికి ప్రధాని ప్రకటనలో కొత్త ఏమీలేదు, ఒక వేళ ఉన్న అవకాశవాదపు ‘కొత్తదనం’ ఏదైనా ఉందంటే అది- భూకేటాయింపులకూ, బదలాయింపులకూ ఇక మీదట మంత్రిమండలి (కేబినెట్) ఆమోదం కూడా అక్క ర్లేదట! అంటే, ప్రధాన మంత్రి అనుమతి ‘తాతాచార్యుల ముద్ర’ కింద సమానమన్న మాట!
ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంత్రిమండలి ఆమోదంతో సమష్టి బాధ్యత తోనే అనుమతులు, 26 జీఓలు జారీచేసింది. ప్రధాని ప్రక టన ప్రకారం ఇక ఈ కేసులేవీ ఉనికిలో ఉండే అవకాశం లేదు. అయినా అవన్నీ ఎవరికో ‘లాభ లబ్ధి’ కలిగించడం కోసమని వైఎస్ ఆ జీవోలు తీసి, వాటి చాటున ఎవరెవరో ‘సాక్షి’లోనో, లేదా జగన్ కంపెనీల్లోనో పెట్టుబడులు పెట్టా రన్న ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు. మరీ విశేషమేమంటే పెట్టుబడులు పెట్టినవారిలో ఎవరూ ఫలానా వాళ్లవల్ల తామింత నష్టపోయాం, నష్ట పరిహారం కోసం కేసులు పెడతామని ఇప్పటిదాకా ముందుకు రాలేదు. అయినా అరెస్టులు, వేధింపుల నాటకా నికింకా తెరపడలేదు!
ఇప్పుడు ప్రధానమంత్రి సడలింపుల మధ్య, అదే కేంద్ర నాయకత్వం కక్షకొద్దీ ‘వాయిదా’ల పద్ధతిపై చార్జి షీట్ల ప్రహసనాన్ని సీబీఐ కొండవీటి చాంతాడులా కొనసా గిస్తూనే ఉండటం హాస్యాస్పదంగా మారింది. ప్రధాన మంత్రి ప్రకటన ప్రకారం, వైఎస్ కేబినెట్ ఆమోదించిన 26 జీఓలు కూడా సబబైనవే కావాలి. మన్మోహన్ ప్రస్తా వించిన పీపీపీలు సక్రమమైనవే అయినప్పుడు అదే కాం గ్రెస్‌కు చెందిన వైఎస్ జీఓలు కూడా దోషరహితాలే కావాలి. న్యాయ సూత్రం హస్తినకూ, హైదరాబాద్‌కూ ఒకటే కావాలి! ప్రపంచ బ్యాంకు ‘సంస్కరణ’లను బేషరతుగా తలకెత్తుకున్న పాలకవర్గాలు (కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు) 1948 నాటి, 1956 నాటి నెహ్రూ పారిశ్రా మిక విధాన ప్రకటనలకూ, కనీస మిశ్రమార్థిక వ్యవస్థకూ కాలదోషం పట్టించాయి. ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్య వాద కూటమి తమ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా ఇండియా లాంటి వర్ధమాన దేశాల్ని ‘ప్రపంచీకరణ’ మం త్రంతో లోబరచుకున్నది. అందులో భాగంగానే మల్టీ నేష నల్ కంపెనీలు, విదేశీ గుత్తసంస్థల మదింపుదార్లు, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబెడులూ భారత ఆర్థికరంగంలోని సర్వ శాఖలకూ విస్తరించాయి. ఆ విస్తరణలో భాగమే ‘పారిశ్రా మికీకరణ’, ‘ఆధునిక వ్యవసాయీకరణ’ పేరిట విదేశీ గుత్త పెట్టుబడులు భారీ ఎత్తున దిగుమతి అయ్యాయి. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు లేదా కాంట్రా క్టులకూ దారాదత్తం చేయాలన్న ప్రతిపాదన ఇంకా చావ లేదు. వ్యవసాయ భూముల్ని క్రమంగా సేద్యం నుంచి దూరం చేస్తూ విదేశీ, స్వదేశీ రేట్‌లకు వేల ఎకరాలు కట్ట బెట్టి క్రమంగా ఆహార సంక్షోభానికి దారితీశాయి.
ఆ మాటకొస్తే... విదేశీ గుత్తపెట్టుబడుల చాటున విదేశీ పెట్టుబడుల అండదండలు లేకుండా బతకలేని పరా ధీన స్వదేశీ గుత్తవర్గాలు కూడా పాలకపక్షాల భూపందా రాలు లేదా భూముల బదలాయింపులను అనుభవిస్తున్న వారే! బలవంతంగా సేదపు భూముల్ని పరిశ్రమాభివృద్ధి పేరిట రైతుల నుంచి నష్టపరిహారం ఎరచూపి ప్రభు త్వాలు గుంజుకున్నందుకే ఇటీవల మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో పలు రాష్ట్రాల్లో రైతులు, వ్యవసాయ కార్మి కులు అనేకచోట్ల పోరాటాలు చేయవలసివచ్చింది.
వీటిలో ప్రధానంగా పేర్కొనదగినవి - కళింగనగర్, పోస్కో, కాశీపూర్, నియాంగిరి, నందిగ్రామ్, సింగూర్, జైతాపూర్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీకాకుళం, హైదరా బాద్, విశాఖ పోరాటాలు. ఆ సందర్భంగా రైతాంగ ప్రజ లు పోలీసు దాష్టీకాలకూ, నిర్బంధాలకూ గురయ్యారు. ఈ దౌర్జన్యకాండ వెనక ఎవరి కోసం భూముల్ని బలవం తంగా బదలాయిస్తున్నారో ఆ కార్పొరేషన్లు - టాటా స్టీల్, పోస్కో, హిండాల్కో, సలీమ్ గ్రూపు, టాటా మోటార్స్, భారత అణుశక్తి నిర్వహణ సంస్థ, జేపీ ఇన్ ఫ్రాటెక్ వగైరా కంపెనీలున్నాయి. పెట్టుబడి ప్రపంచీకరణ చాటున క్రమంగా దారిద్య్ర ప్రపంచీకరణ సాగుతూ వచ్చింది. ‘కార్పొరేషన్’ అంటే దాని ‘ప్రమోటర్ల’ రూపంలో ఉండే టాటాలు, బిర్లాలు, అంబానీలు వగైరా మాత్రమే కాదు, నాటక కళలో ‘దశరూప’ ఎలాగో విదేశీ గుత్తద్రవ్య సంస్థల దోపిడీ కూడా దశ రూపాల్లోనే ఉంటుంది. ఒరిస్సాలో భూకబ్జాదారైన కొరియన్ కార్పొరేషన్ ‘పోస్కో’లో బడా వాటాదారు ఎవరు? బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్. అదీగాక అనేక మంది అమెరికన్ గుత్త పెట్టుబడిదారులూ అందులో భాగస్వాములు! ‘సంస్కరణల’ ప్రవేశంతో యావత్తు భారతదేశమూ దోచుకునేవారి ‘చేతిఎత్తుబిడ్డ’గా మారి పోయింది!
ఇటీవల అమెరికన్ ‘టైమ్’ పత్రిక మన్మోహన్‌సింగ్‌పై ప్రకటించిన వ్యంగ్య పూర్వకమైన ఆగ్రహానికి కారణం- ఇండియాలో ఇప్పుడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విస్తరణ చాలదనీ, బ్యాంకింగ్, బీమా లాంటి ద్రవ్య సేవలందించే సంస్థల్లో కూడా బహుళజాతి కంపెనీలకు గణనీయమైన స్థానం వెంటనే కల్పించలేదని మాత్రమే! అయితే ఈ సేవా సంస్థలలో కూడా ఐటీ రంగంలో మాదిరే విదేశీ గుత్తేదార్లు బలంగా దూరారు, లేదా దూరం నుంచే మన సంస్థల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటున్నారు. ఈ విదేశీ సంస్థల ఆధిపత్యంలో లేదా స్వదేశీ సంస్థలతో ఉన్న మిలాఖత్ ఒప్పందాల ద్వారా జరుగుతున్న పెద్ద నాటకం - మన స్వదేశీ కార్మికుల జీవితాలను, జీతనాతాలను శాసించబోవడం, కార్మికులు ఎదురుతిరిగిన చోట, పని భారం పెరిగిన చోట నిరసన తెలిపిన సందర్భాలలో దారు ణమైన నిర్బంధ విధానానికి గురిచేయడం! యూపీఏ సర్కార్ బాహాటంగా అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధా నాలు యథేచ్ఛగా కొనసాగినంత కాలం ఈ పరాయీకరణ తప్పదని చెప్పవచ్చు!
No comments:
Post a Comment