కాంగ్రెస్‌లో బీసీలను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ కొండా మురళి మండిపడ్డారు. బీసీ మంత్రులను జైలుకు పంపించడమే ఇందుకు నిదర్శనమని కొండా మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ను బతికించిందే తమ కుటుంబమని కొండా మురళి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మహానేత వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్నందుకే మాపై కక్ష కట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజలు ఎప్పుడో అనర్హతవేటు వేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో మిగిలింది లోఫర్లు, జోకర్లు, బోకర్లేనని తీవ్ర స్థాయిలో కొండా మురళి మండిపడ్డారు. ఎమ్మెల్సీ కొండా మురళీపై శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి సోమవారం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment