టీడీపీ నేత బైరెడ్డి రాజ శేఖరరెడ్డి చేస్తున్న దీక్ష వెనుక ఆ పార్టీ అధినేతచంద్రబాబు ఉన్నారని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై కచ్చితమైన అభిప్రాయంతో కేంద్రానికి టీడీపీ లేఖ రాయాలని ఈ ప్రాంతనేతలు ఒత్తిడి చేస్తుండటంతోనే చంద్రబాబు కొత్త నాటకానికి తెరదీశారన్నారు. సీఎల్పీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘రాయలసీమ వాళ్లు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. కానీ బెరైడ్డి మాత్రం రాష్ర్టం ఉంటే సమైక్యంగా ఉండాలి. లేకుంటే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాంటూ రెండు తలల పాము మాదిరిగా మాట్లాడుతుండు. సీమకు అన్యాయం జరిగిందని చెబుతున్న బైరెడ్డి .. సమైక్య రాష్ట్రం కావాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్థంకావడం లేదు. ఈ రాష్ట్రాన్ని పాలించిన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, బాబు, వైఎస్, కిరణ్‌కుమార్ రెడ్డి వంటి నేతలంతా రాయలసీమ వాళ్లే. ఇంకా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే ఎట్లా? ’’ అని పేర్కొన్నారు. ఆయనకు రాయలసీమ రాష్ట్రంపట్ల చిత్తశుద్ధి ఉంటే సమైక్య రాష్ర్టం గురించి మాట్లాడకుండా ఉద్యమిస్తే తాము మద్దతిస్తామన్నారు.

No comments:
Post a Comment