
వైఎస్ మరణించినపుడు పరామర్శించడానికి వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వైఎస్ మహానేతని, అత్యంత సమర్థుడైన నాయకుడని, రాష్ట్ర సంక్షేమానికి కృషిచేసిన వ్యక్తిగా అభివర్ణిస్తూ సంతకాలు చేశారని గుర్తు చేశారు. జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ (జీ 3045) ప్రధాన కార్యదర్శి పి.కాశీ మధుబాబు, అధ్యక్షుడు కేఎన్వీ సీతారామ్ మాట్లాడుతూ జగన్ తమకు అండగా నిలుస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు బీపీకే చంద్రం, బి.రమేష్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, మెదక్ జిల్లా కన్వీనర్ నర్రా భిక్షపతి, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ అవిర్నేని శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కన్వీనర్ వేజెండ్ల శివశంకర్, విజయవాడ సిటీ కన్వీనర్ విశ్వనాథ రవి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment