ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిదిన్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు తన ఘనత గురించి పదే పదే తానే చెప్పుకుంటూ ఉంటారు. తెలుగువాళ్లకు తానే కంప్యూటర్లనిచ్చానని ఒకసారి, సెల్‌ఫోన్లు తన పుణ్యమేనని మరోసారి, అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని ఇంకోసారి, అసలు తను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పిందే తానని అనేక సందర్భాల్లోనూ చెప్పుకున్నారు చంద్రబాబు. ఈ రాష్ట్రానికి తనను తానే సీయీవోగా నియమించుకున్న చంద్రబాబు తన హయాంలో ఏదో పొడిచేశానని లేత సొరకాయలు తెగ కోసేస్తూ ఉంటారు. వాదనకోసం ఆయన చెప్పుకున్నవన్నీ నిజాలేనని ఒప్పుకుందాం- అయితే, అన్ని ఘనకార్యాలు సాధించిన బాబు తెలుగు గడ్డకు ఒరగదోసిందేమిటో? అసలు విషయం ఇదీ!
తాను చక్రం తిప్పినట్లు చంద్రబాబు చెప్పేరోజుల్లో ప్రధానిగా ఉన్న దేవెగౌడ తరచు కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కినమాట నిజమే. దాన్ని ప్రస్తావిస్తూ, దేవెగౌడ తరఫున తానే ఢిల్లీలో రాజ్యం చేస్తున్నట్లు చంద్రబాబు పోజేసేవారు. కానీ, ఒక వంక పార్లమెంటులో కునుకు లాగుతూనే మరోవంక తన సొంత రాష్ట్రం కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టులను కట్టుకుంటూ పోయారు దేవెగౌడ. అందుకే, ఆయనను ఉత్తరాది రాష్ట్రాల నేతలు ‘కర్ణాటక ప్రధాని’గా అభివర్ణించారు. ఎవరు ములిగినా, ఎవరు తేలినా తను ఏంచెయ్యదల్చుకున్నాడో అది చేసిపారేశాడు దేవెగౌడ- అదీ గుట్టు చప్పుడు కాకుండా!
మన కోతల రాయుడు చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పడం తప్పించి చేసిందేమీ లేదు. చివరికి దేవెగౌడ కుతంత్రం వల్లా, చంద్రబాబు చేతగానితనం వల్లా వేలాది సంవత్సరాలుగా మట్టిని నమ్ముకుని బతుకుతున్న కృష్ణా డెల్టా రైతుల కూట్లో దుమ్ముపడింది! ఇంత జరిగినా సిగ్గులేని చంద్రబాబు రైతు బాంధవుడి గెటప్‌లో కొత్త నాటకానికి తెరతీసేందుకు తాపత్రయపడుతున్నారు.
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి బుధవారం -అగస్ట్ ఒకటో తేదీన- మీడియాతో మాట్లాడుతూ బాబు బండారమంతా బయటపెట్టారు. కృష్ణా డెల్టాకు నీరు లేకుండా చేసి నోరుకొట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడేనని ఆయన -ఎల్లో మీడియానే సాక్ష్యంగా తెచ్చుకుని- వెల్లడించారు. ఇది జరిగి 24 గంటలవుతున్నా ఇంతవరకూ చంద్రబాబు గానీ, ఆయన చెమ్చాలుగానీ నోరువిప్పకపోవడం గమనార్హం!
తన హయాంలో చంద్రబాబుసాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చెంతో బయటపెట్టాలని శ్రీకాంత రెడ్డి నిలదీశారు. ప్రాజెక్టుల వ్యయానికీ, రాబడికీ ముడిపెట్టి అప్పట్లో చంద్రబాబుచేసిన కుతర్కాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడికి పాలనకూ, చిల్లరకొట్టు వ్యాపారానికీ తేడా తెలియదని శ్రీకాంత రెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి -దేశంలో ఎక్కడా లేని విధంగా- జలయజ్ఞం పథకాన్ని ప్రవేశపెట్టి ఒకమేరకు అమలుచేస్తూండగా ఇదే చంద్రబాబుఆ ప్రయత్నానికి వంకలుపెట్టి విమర్శించారని శ్రీకాంతరెడ్డి గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగండికోట ప్రాజెక్టును నిర్మించినందువల్ల కృష్ణా డెల్టాకు 30 టీఎంసీల నికర జలాలు దఖలుపడగా, ఆ విషయాన్ని కప్పెట్టి, పులివెందుల కాలువ ద్వారా నీటిని తరలించుకుపోయినందువల్లనే కృష్ణా డెల్టాకు కరువొచ్చిందని చంద్రబాబుమసిపూసి మారేడుకాయ చేస్తున్నారని శ్రీకాంతరెడ్డి బయటపెట్టారు.
అన్నింటికీ మించి, తను ముఖ్యమంత్రిగా ఏలుబడి సాగించే రోజుల్లో నీరు విడుదల చెయ్యవలసిందిగా చేతులమోడ్చి ప్రార్థించిన ఓ రైతును చంద్రబాబుబహిరంగంగా ఎలా విదిలించారో -ఎల్లో మీడియాలో అచ్చయిన కథనం ఆధారంగానే- గుర్తు చేశారు శ్రీకాంత రెడ్డి. ‘వద్దంటే పంట వేశావు- నీకు తగిన శాస్తే జరిగింది- ఇప్పుడు నీకు బుద్ధి వస్తుంది!’ అని వ్యాఖ్యానించిన శాడిస్టు చంద్రబాబు. అలాంటి కర్కోటకుడి పాలనలో వందలాదిమంది రైతులు ఉసురుతీసుకున్నారంటే వింతేముంది? వింతా విడ్డూరం ఎక్కడుందంటే, అదే చంద్రబాబుఇప్పుడు రైతన్నల రక్షకుడిగా అవతారమెత్తాలనుకోవడంలో ఉంది. రైతుకూలీల సంక్షేమానికే అంకితమయ్యామని చెప్పుకునే నేతలూ - సంస్థలూ చంద్రబాబుకు తాషామర్ఫాలు కొట్టడంలో ఉంది.
No comments:
Post a Comment