నెల్లూరు : తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాద ఘటనపై సీనియర్ జడ్జితో విచారణ చేయించాలని నెల్లూరు జిల్లా కొవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలన్నారు. ఇప్పటివరకూ 17 మృతదేహాలను వెలకితీసినట్లు నల్లపరెడ్డి తెలిపారు. ఈ దుర్ఘటన వెనక సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ జరిపించాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment